31-12-2025 11:44:15 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) షాబునగర్‌లో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షాబునగర్‌లో మురికి కాలువలో నెలలు నిండని ఆడశిశువు(baby girl) మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు నెలలు నిండని శిశువును మురికి కాలువలో పడేశారు. గర్భస్థ ఆడశివువు వయసు సూమారు ఆరు నెలలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కడుపులో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలిసి అబార్షాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలువలు శుభ్రం చేస్తుండగా నెలలు నిండని శిశువు మృతదేహాన్ని పారిశుధ్య కార్మికులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.