31-12-2025 11:36:05 AM
హైదరాబాద్: మెదక్ జిల్లా నిజాంపేటలో(Nizampet) యూరియా కోసం రైతులు(Farmers) బారులుతీరారు. చలిలోనూ తెల్లవారుజాము నుంచే యూరియా కోసం క్యూలైన్లో ఇబ్బంది పడుతున్నారు. రబీ నాట్లు ప్రారంభం కావడంతో యూరియా దొరకదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా(Urea) కోసం రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్(Medak Collector Rahul Raj) వెల్లడించారు. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందిస్తుందని మెదక్ కలెక్టర్ వివరించారు. అన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా ఉంచుతామని ఆయన తెలిపారు.