16 July, 2026 | 4:47 PM

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

06-06-2024 11:18 AM

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మర్దనపేట గ్రామానికి చెందిన ముండ్రాయి సందీప్ (38) పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కోనారావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.