2 July, 2026 | 10:50 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

21-06-2025 11:04 PM

మోతే: బైక్ అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న గోతిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) మోతే మండల పరిధిలోని మామిల్లగూడెం సమీపంలో సూర్యాపేట ఖమ్మం రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం... మునగాల మండలం నారాయణగూడ గ్రామానికి చెందిన చింత శ్రీకాంత్(27) సంవత్సరాలు మునగాల నుంచి మోతే మీదుగా నాయకన్ గూడెం వెళుతుండగా మామిల్లగూడెం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న రోడ్డు వెంబడి బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో రోడ్డు వెంబడి ఉన్న గోతిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కలదు తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.