2 July, 2026 | 11:59 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

‘మోడల్’ టీచర్ల విభజన తర్వాతే పదోన్నతులు

22-06-2025 12:00 AM

టీఎంఎస్‌టీఏ అధ్యక్షుడు యాకమల్లు విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మోడల్ స్కూల్ ఉపాధ్యా యుల క్యాడర్ విభజనకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం జారీ చేయడంతో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు హ ర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కొత్త జోన్ల విభజన ప్రక్రియను న్యాయ, సాంకేతికపరమైన చిక్కులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించా లని ప్రభుత్వాన్ని కోరారు. విభజన ప్రక్రియ తర్వాత వెంటనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.