31 May, 2026 | 10:07 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

వడదెబ్బకు వ్యక్తి మృతి

10-04-2026 06:42 PM

అనాధలైన ముగ్గురు పిల్లలు 

నవభారతలో విషాదఛాయలు

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవ భారతి ఏరియా కు చెందిన భానోత్ బద్రు (57) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే బద్రు గత మూడు రోజులుగా కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతాల్లో సిమెంట్ పనులు చేస్తూ తీవ్ర ఎండలకు వాంతులు, విరోచనాలకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృత్యువాత పడ్డాడు. కుటుంబానికి పెద్దది ఎక్కువగా ఉన్న బద్రు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.