12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

నోటిఫికేషన్ ద్వారానే మేనేజ్‌మెంట్ సీట్లు

08-08-2024 01:04 AM

కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీల్లోని 30 శాతం మేనేజ్‌మెంట్ (బీ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేయాలని కాలేజీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. ముం దస్తుగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ ప్రధాన పత్రికల్లో అడ్మిషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థు ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించింది. అప్లికేషన్లను విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది. తమ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్లు భర్తీ చేయాలని, లేకుం టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాలేజీలు ఆగస్టు 9 లోపు నోటిఫికేషన్లు జారీచేయాలని, దరఖాస్తు చేసుకోవడానికి ఆరు రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్టు 29లోపు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 10లోపు అడ్మిషన్లు పొందిన వివరాలను తమకు సమర్పించాలని స్పష్టంచేసింది.