06-05-2025 10:35:26 AM
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం లేఖ రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ(TGSRTC Management) సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని యాజమాన్యం కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించు కుందామని తెలిపింది. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుని అభివృద్ధి పథంలో వెళ్తోందని వెల్లడించింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లిందని యాజమాన్యం వివరించింది. ఒక వర్గం మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితం కావొద్దని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం అన్న ఆర్టీసీ యాజమాన్యం సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని ఆర్టీసీ మందలించింది.