calender_icon.png 6 May, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మహిళా మావోయిస్టు మృతి

06-05-2025 02:08:34 PM

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్(Chhattisgarh) లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్(Encounter) లో ఒక మహిళా నక్సలైట్ మృతి చెందినట్లు మంగళవారం ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల అడవిలో సోమవారం ఈ కాల్పులు జరిగాయి. ఇక్కడ భద్రతా దళాల ఉమ్మడి బృందం రెండు వారాలకు పైగా భారీ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోందని బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ మీడియాకి తెలిపారు. తుపాకులు నిశ్శబ్దమైన తర్వాత ఒక మహిళా నక్సలైట్ మృతదేహం, 303 రైఫిల్ ను ఆ ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ తో ఏప్రిల్ 21న ప్రారంభించిన ఆపరేషన్ లో నలుగురు మహిళా మావోయిస్టులు హతమయ్యారని అధికారి తెలిపారు.