06-05-2025 02:00:01 PM
హైదరాబాద్: నాగోల్ సమీపంలోని అల్కాపురి కాలనీలోని సాయి నగర్ కాలనీ(Sai Nagar Colony)లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 10 గుడిసెలు దెబ్బతిన్నాయి. షార్ట్ సర్క్యూట్, తరువాత గ్యాస్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక గుడిసె గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ సంఘటన జరిగింది.
దీనితో అప్రమత్తమైన దాని పక్కనే ఉన్న గుడిసెలలో(Huts caught fire) నివసించేవారు ఇళ్ల నుండి సురక్షితంగా బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన సమీపంలో భయాందోళనలకు గురిచేసింది. నిమిషాల్లోనే మంటలు చుట్టుపక్కల ఉన్న ఇతర గుడిసెలకు వ్యాపించాయి. సమీపంలోని నివాస ప్రాంతంలోని స్థానికులు మంటలు, గుడిసెల నుండి వెలువడుతున్న దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు పోలీసు విభాగాల సిబ్బందితో కలిసి మంటలను ఆర్పారు. గుడిసెలలో గడ్డి, ప్లాస్టిక్ పదార్థాలు ఉండటం వల్ల పరిసరాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.