06-05-2025 01:07:23 PM
కల్లూరు, (విజయక్రాంతి): పట్టణ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు దయాల కిషోర్ దత్(Congress leaders Dayala Kishore Dutt) మాతృమూర్తి, విశ్రాంతి ఉపాధ్యాయురాలు దయాల లక్ష్మీ వయో భారం తో మంగళవారం మరణించారు. జిల్లా ఆర్యవైశ్య సభ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు దామల రాజు, కల్లూరు మాజీ సర్పంచ్ బంక బాబు, మరియు కల్లూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఉబ్బన రాంబాబు, పెద్ద బోయిన రామ నరసింహారావు, మారబోయిన శ్రీనివాసరావు, బొల్లం ఉపేందర్,మేకల సాంబశివరావు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.