06-05-2025 01:22:13 PM
కాంటాక్ట్ కార్మికుడు మృతి
మరో ముగ్గురికి గాయాలు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) గోలేటి 1 ఇంక్లైన్ వద్ద తేనెటీగల దాడిలో కాంటాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాదారం ప్రాంతానికి చెందిన పుప్పాల నరసయ్య (55) గోలేటి 1లో ముగ్గురు కార్మికులతో కలిసి గోడ నిర్మాణ పనులు చేస్తున్నారు. అస్మాత్తుగా తేనెటీగ లు దాడి చేశాయి. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వెంటనే గోలేటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన నరసయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బెల్లంపల్లి ఏరియా ఆ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసయ్య మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు సంధ్యారాణి, సౌందర్య, స్రవంతి ఉన్నారు.