calender_icon.png 6 May, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో జింక మృతి

06-05-2025 01:19:31 PM

బెల్లంపల్లిఅర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కుక్కల దాడిలో ఓ జింక పిల్ల మృతి చెందిందన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీ లోనీ గోల్ బంగ్లా స్మశాన వాటిక సమీపంలో రెండు సంవత్సరాల  జింక పిల్ల మృతి చెందిందిఉంది. తీవ్రంగా గాయపడి స్థితిలో ఉన్న జింక కుక్కల దాడిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఐటీడీఏ తోట నుంచి తరచుగా జింకపిల్లలు గోల్ బంగ్లా స్మశాన వాటిక వైపు వస్తూ పోతుంటాయి. ఇదే క్రమంలో జింకి పిల్ల కుక్కల దాడికి గురైనట్లు తెలుస్తోంది.