19 August, 2026 | 2:56 AM

శర్వాకు జోడీగా..!

19-08-2026 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా కొత్త సినిమా ‘జార్జ్ క్రిష్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా మానస వారణాసి నటించనున్నట్టు సమాచారం. హీరోయిన్‌గా ఆమె పేరు దాదాపు ఖరారైనట్టేనని టాక్. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను శర్వానంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. హీరోయిన్ ఎంపిక, బిజినెస్ పరంగా వస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మానస వారణాసి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ మానస వారణాసి హీరోయిన్‌గా ఎంపికైతే.. శర్వాతో ఆమెకు ఇదే తొలి సినిమా కానుంది.