24-07-2025 10:11:05 PM
భీమారం (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) జన్మదిన సందర్బంగా భీమారం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ లోని కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయక్, యువ నాయకులు భూక్య రాజు నాయక్, రాజేష్ నాయక్, నవీన్ నాయక్, ఆలోత్ ప్రవీణ్ నాయక్ తదితరులున్నారు.