calender_icon.png 5 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2025 10:15:01 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) జన్మదిన వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం చెన్నూరు నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధారి మైసమ్మ ఆలయంలోకి ప్రత్యేక పూజలు నిర్వహించి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. 

గులాబి శ్రేణులతో కలిసి రామకృష్ణాపూర్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్,రామిడి కుమార్,పోగుల మల్లయ్య,గడ్డం రాజు, జక్కన బోయిన కుమార్,వెంకటేశం,సత్తయ్య,బొమ్మ భూమన్న గౌడ్,నందిపేట సదానందం,పైతార్ ఓదెలు, టైలర్ రాజు,పిల్లి సతీష్,రామిడి లక్ష్మీకాంత్, చంద్రగిరి కిరణ్, కల్వల సతీష్, మనీ తదితరులు  పాల్గొన్నారు.