24-07-2025 10:09:00 PM
కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు మంద సంజీవరెడ్డి, కొత్త రవి గౌడ్..
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్(Boduppal Municipal Corporation) పరిధిలో బీఆర్ఎస్ బోడుప్పల్ మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్, చెంగిచెర్ల గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలిపి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.