ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా మండల వాసులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 23: మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షునిగా కునుకుంట్ల సైదులు మ్,జిల్లా ప్రధాన కార్యదర్శి గా బొడ్డు శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కోదాడలో ఆ సంఘం జిల్లా2వ మ హాసభల్లో రాష్ట్ర కార్యదర్శి,సహాయ కార్యదర్శులు మండల వెంకన్న,మండారి డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో మరో 10 మందితో కా ర్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా నూ తన అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగాలకు అప్పగించే విధానాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈనెల 28,29,30 తేదీలలో జిల్లా వ్యాప్తంగా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమానికి రైతు లందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






