24 June, 2026 | 2:43 AM

సోయా పంటను వేస్తున్న రైతులు

24-06-2026 01:39 AM
  1. వాన కురిసే ... రైతు మురిసే 
  2. నిర్మల్ జిల్లాలో జోరుగా సాగు 

నిర్మల్ జూన్ 23 ( విజయ క్రాంతి) ఖరీఫ్ రైతుకు వానదేవుడు కరుణించాడు. జిల్లావ్యాప్తంగా సోమవారం వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తి ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న చిరుజల్లులు తప్ప భారీ వర్షం కురవకపోవడంతో అన్నదాత ఆందోళన చెందారు. వేస వి దుక్కులు దున్నుకొని విత్తనాలు ఎరువు లు సేకరించి వర్షాలు కురిస్తే విత్తనం వేద్దామన్న వాన జాడ లేకపోవడంతో చాలామం ది రైతులు విత్తనాలు విత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు వర్షాలు కురవాలని పంట సాగు చేయాలని రైతులు ఆశగా కారు మబ్బుల వైపు చూసిన ప్రయోజనం లేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆందోళన ఏర్పడింది. 

వాన కురిసే రైతు మురిసే

అయితే సోమవారం జిల్లాలోని నిర్మల్ భైంసా ఖానాపూర్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ భూములు తడిసి ముద్దయ్యాయి. మంగళవారం జిల్లా లో భైంసా కుబీర్ కుంటాల సారంగాపూర్ నర్సాపూర్ లోకేశ్వరం ముధోల్ బాసర్ లక్ష్మణ చందా మామడ కడెం దస్తురాబాద్ తానూర్ సోన్ తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి మొక్కజొన్న సోయా విత్తనాలను పంట పనులు వేసుకున్నారు. మాయా పంట పొ లాల్లో ఎక్కడ చూసినా రైతుల సందడి కనిపించింది. వాతావరణం కూడా చల్లబడడం మేఘాలు రావడంతో వేసిన విత్తనానికి మరో జల్లు కురిస్తే అవి మొలకెత్తి అవకాశం ఉందని వరుణదేవుడు తప్పకుండా కరుణ చూపిస్తారని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.