పదవ తరగతి మండల టాపర్ కు రవీంద్ర భారతిలో సన్మానం
12-05-2026 12:05 AM
జుక్కల్, మే 11 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో జుక్కల్ మండల టాపర్ గా నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జుక్కల్ విద్యార్థిని జి.ముక్తేశ్వరికి (బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించడం జరిగిందని హెచ్‌ఎం హనుమంత్ రెడ్డి తెలిపారు.
మల్లు రవి, నాగర్ కర్నూల్ ఎంపీ, కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ, సీనియర్ నాయకులు వి.హన్మంత రావ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ మేరకు గ్రామస్తులు ముక్తేశ్వరిని అభినందించి, హర్షం వ్యక్తం చేశారని చెప్పారు.






