నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే
భూత్పూర్, మే 11 : ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నాణ్యమైన విద్యను అందించడం కోసం కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ విద్య సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో బోధనను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, కౌన్సిలర్లు పద్మ, లత సూరన్న గారి, లాలూ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






