27 July, 2026 | 6:06 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

వివాదంలో మాణికేశ్వరి మాత ఆశ్రమం

20-09-2025 12:32 AM
  1. ఆశ్రమం మాదే అంటున్న ఇరువర్గాలు   

దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు  

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 19 : నల్లగొండ పట్టణంలోని  గంధం వారి గూడెం లో 1980 లో భక్తుల విరాళంతో  నిర్మించిన  ఓంకార స్వరూపిణి శ్రీ శ్రీ జగద్గురు బాలయోగి మాణికేశ్వరి మాత  ఆశ్రమం వివాదంలో పడింది.

నాన్నగారు ఏర్పాటుచేసిన ఆశ్రమంలోమాకి  మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారని ఆశ్రమంపై యాజమాన్య హక్కుల ప్రకారం తమకే చెందుతాయని తాను ఆశ్రమానికి వారసత్వ పీఠాధిపతినని హైదరాబాద్ కు చెందిన కందాడి జగ్జీవన్ రెడ్డి అనే వ్యక్తి .

ఈ భూములను తన పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని గతంలో ఆశ్రమాన్ని నిర్వహించి మరణించిన దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు కుటుంబ సభ్యులు గత రెండు రోజుల నుండి  ఆశ్రమం ఎదుట ఆందోళన చేస్తున్నారు. 

ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆశ్రమానికి  వారికి ఎలాంటి సంబంధం లేదని  ప్రస్తుతం ఆశ్రమం నిర్వహిస్తున్న గంగాధర చారి చెబుతున్నారు. 15.24 ఎకరాల భూమిలో నెలకొల్పిన ఈ ఆశ్రమం యాజమాన్య హక్కులపై ఇప్పటికీ ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. జరుగుతున్న వివాదంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న గొడవలకు  ఆశ్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వన్ టౌన్ సీఐ  పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.