calender_icon.png 20 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బాంధవుడు బీఎల్‌ఆర్

20-09-2025 12:30:40 AM

మిర్యాలగూడ, సెప్టెంబర్ 19 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ చైర్మన్ పోలగాని వెంకటేష్ గౌడ్ కొనియాడారు. నియోజకవర్గ రైతులందరికి ఒక యూరియా బస్తా ఉచితంగా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డికి రూ. 2 కోట్ల చెక్కు ఇవ్వడం పట్ల శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆయనను అభినందించి మాట్లాడారు.

రైతుల కండల్లో ఆనందం చూడడానికి కృషి చేసిన మహా నాయకుడిని. ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుఅనంతరెడ్డి. అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పాప చెన్నారెడ్డి.నాయకులు నామిరెడ్డినరసింహారెడ్డి. పల్ రెడ్డి ఉపేందర్ రెడ్డి.శ్రీరాంరెడ్డి. వెంకటరెడ్డి.నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.