23 May, 2026 | 9:55 AM

బైజూస్ ఉద్యోగులకు జీతాల్లేవు

21-08-2024 01:37 PM

ఢిల్లీ : ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ కంపెనీ  వేలాది మంది ఉద్యోగుల జూలై నెలలో జీతాలకు సైతం మొండి చేయి చూపించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పలు న్యాయ పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న బైజూస్ సీఈఓ బైజూ రవీంద్రన్ ఉద్యోగులను ఉద్దేశించి ఈ మెయిల్ సందేశం ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎంత రుణాలలో ఉన్నా సరే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తానని ఈ మెయిల్ లో తెలిపారు. కాగా బీసీసీఐ తో వివాదాల కారణంగా బైజూస్  దివాలాకు దారి తీసే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. పిటిషనర్లు ఆరోపించినట్లుగా  తాను ఎక్కడికీ పరారీ కావడం లేదు అని రవీంద్రన్ స్పష్టం చేశాడు.