15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మణికొండ మున్సిపాలిటీ కొత్త ఆఫీస్‌కు చకచకా అడుగులు

03-11-2025 08:17 PM

లాంకో హిల్స్‌లో నూతన భవనం

పనులు పర్యవేక్షించిన కమిషనర్ ప్రదీప్ కుమార్

మణికొండ,(విజ‌య‌క్రాంతి): మణికొండ మున్సిపాలిటీకి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లాంకో హిల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కార్యాలయ పనులను సోమవారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. పనులను దగ్గరుండి పరిశీలించిన ఆయన, నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. నూతన కార్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి, మణికొండ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.