calender_icon.png 4 November, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు

03-11-2025 08:13:36 PM

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు..

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్ డబుల్ బెడ్ రూమ్ లలో అధికారులు, నాయకులు స్థానికులకు కాకుండా డబ్బులకు డబుల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన నిజమైన పట్టాదారులకు శాపంగా మారింది. పట్టాదారులకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్న విధంగా ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తూ కరెంటు, నీళ్లు లేకుండా చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజమైన పట్టదారులమైన మాకు ఇంటి నెంబర్, కరెంటు మీటర్ ఇప్పించి న్యాయం చేయగలరని బాధితులు కోరుకుంటున్నారు.