03-11-2025 08:22:32 PM
మాజీ చైర్మన్‌కు స్థానికుల ఫిర్యాదు..
సిబ్బందికి కస్తూరి నరేందర్ ఆదేశం..
మణికొండ (విజయక్రాంతి): మణికొండ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ లైన్ జామ్ కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. హనుమాన్ నగర్ నుండి పంచవటి కాలనీ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు పారుతుండటంతో ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన నరేందర్ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందిని పిలిపించి సమస్యను వివరించారు. ముఖ్యమైన డ్రైనేజ్ లైన్ జామ్‌ను వెంటనే తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇంజనీరింగ్ విభాగాన్ని కోరారు. అనంతరం ఆయన కాలనీవాసులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ షా ఖాన్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ ఉన్నారు.