15-01-2026 02:07:28 AM
సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో ఘటన
సంగారెడ్డి, జనవరి 14(విజయక్రాంతి): నిషేధిత చైనా మాంజా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ప్రాంతంలో బీహార్ రాష్ట్రానికి చెందిన అద్వైక్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా గొం తుకు తగిలి తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
సంక్రాంతి సందర్భంగా చైనా మాం జా వినియోగించవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు వీటిని విక్రయిస్తున్నారు. మరోవైపు అధికారుల తనిఖీలు లేకపోవడంతో విక్రయదారులు యథేచ్ఛగా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నారు. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.