2 July, 2026 | 2:19 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

మంథని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా మనోహర్ నియామకం

24-09-2024 11:00 AM

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గా మనోహర్ ను నియమిస్తూ కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన మల్లికార్జున స్వామిని కలెక్టర్ హైదరాబాద్ లోని సీపీఎంఏ కార్యాలయానికి  సరెండర్ చేయగా, మంథని మున్సిపల్  కార్యాలయాల్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ కు  ఇంచార్జ్ బాధ్యతలు కలెక్టర్ అప్పజెప్పారు. మంథని లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ వర్సెస్ అన్నట్టుగా సాగిన నాటకీయ  పరిణామాలు చివరికి కమిషనర్ ఒంటేద్దు పోకటలతో సరెండర్ అయ్యే దాకా పరిస్థితి వచ్చింది.