బాధ్యతలు స్వీకరించిన సీఐని కలిసిన మణుగూరు ఏరియా టిబిజికెయస్ వైస్ ప్రసిడెంట్
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి. నాగబాబు ను గురువారం మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణ లో అంకితభావం ప్రదర్శించి నూతన ఉత్తేజం నింపుకొని ప్రజలకు శాంతి భద్రతలు సమన్యాయం అందించాలని కోరారు. శాంతిని పరిరక్షించడంలో నిస్వార్థ సేవలు అందించాలని కోరారు. సింగరేణి పీవీ కాలనీ ఏరియా కార్మిక వాడల్లో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో యస్ ఐ ప్రసాద్ నాయకులు బంగారి పవన్ కుమార్, వినయ్ కుమార్, ముకేశ్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు,రమేష్, శ్రీనివాస్, శ్రావణ్, రాజేష్, రమేష్ బాబు, రఫీ , ధర్మనంద రావు , రవి తదితరులు పాల్గొన్నారు






