29-05-2025 12:23:32 PM
తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి, విజయక్రాంతి: దళిత బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, ఎమ్మెల్యే మందుల సామేలుకు మంత్రివర్గ విస్తరణలో మాదిగ జాతి తరపున మంత్రి పదవి ఇవ్వాలని మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) ఎస్సీ వర్గీకరణలో భాగంగా మంత్రి పదవిని మాదిగ జాతి ముద్దుబిడ్డ , అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేలుకు అవకాశం ఇచ్చినట్లయితే తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 1400 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కలికోట్ల మల్లేష్, దాసరి శ్రీను, పులిగుజ్జు యాకయ్య, నాగరాజు, అంజయ్య, వెంకన్న ,సోమయ్య తదితరులు పాల్గొన్నారు