28 March, 2026 | 9:13 PM

యువకులకు క్రికెట్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్

28-03-2026 07:38 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): గ్రామీణ యువకులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య గ్రామంలోని యువకులకు తన సొంత ఖర్చుతో క్రికెట్ కిట్టును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని, యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్ చొరవను అభినందిస్తూ క్రీడాకారులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంద బలరాం, బంగ్లా ప్రవీణ్,రవీందర్,అంజయ్య ,గఫుర్, జీ పి ఒ సంగమేశ్వర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి తుకారాం గ్రామ క్రీడాకారులు, యువకులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.