calender_icon.png 7 July, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

07-07-2025 05:14:14 PM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..

వలిగొండ (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. సోమవారం వలిగొండ మండలంలోని టేకులసోమారం, పహిల్వాన్ పురం, రెడ్లరేపాక, సుంకిశాల, పులిగిల్ల, కాంచనపల్లి, వెలువర్తి, కేర్చిపల్లి, మొగిలిపాక, ఎం.తుర్కపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తుందని అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రతి రేషన్ లబ్ధిదారుడికి సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి నెరవేర్చడం జరిగిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని గ్రామాల అభివృద్ధి కోసం సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మరెడ్డి నరేష్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ కుంభం విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, నాయకులు వాకిటి అనంతరెడ్డి, బత్తిని లింగయ్య, తుమ్మల యుగంధర్ రెడ్డి, గరిసె రవి, గుర్రం లక్ష్మారెడ్డి, చేగురి మల్లేశం, పబ్బు ఉపేందర్ బోస్, రేఖల ప్రభాకర్, చెరుకు శివయ్య గౌడ్, బత్తిని సహదేవ్, మాధ శంకర్ గౌడ్, నోముల మల్లేష్ యాదవ్, ఉలిపే మల్లేశం, ఐటిపాముల రవీంద్ర, జక్క జంగారెడ్డి, పల్సం సతీష్, కాసుల వెంకటేశం, బద్దం సంజీవరెడ్డి, గంగాపురం దైవాదినం తదితరులు పాల్గొన్నారు.