calender_icon.png 7 July, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో దొంగతనాలు అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్

07-07-2025 05:20:05 PM

ఇకనుంచి వీపిఓల ఏర్పాటు, స్పెషల్ టీం లతో నిరంతర పెట్రోలింగ్..

మంథని పోలీస్ స్టేషన్ లో ధర్మారం గొలుసు దొంగల అరెస్ట్ లో మంథని సిఐ రాజు..

మంథని (విజయక్రాంతి): మంథనిలో దొంగతనాలు అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ ఉంటుందని, ప్రజలకు మరింత రక్షణ కల్పించేందుకు ఇక నుంచి గ్రామానికి ఒక వీపిఓలను ఏర్పాటు చేసి స్పెషల్ టీం లతో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తామని మంథని సీఐ రాజు(CI Raju) తెలిపారు. సోమవారం మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడుతూ... ఇటీవల మంథని మండలంలోని ధర్మారం గ్రామంలో కందుకూరి లక్ష్మి అనే వృద్ధురాలు పై ఉన్న బంగారు గొలుసు ను ఇంటి పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన రాయినేని మల్లేష్, ఆయన కుమారుడు అనీల్ ను తండ్రి కొడుకులు గత నెల 18 తేదిన తెల్లవారుజామున 3 గంటలకు వృద్ధురాలు ఇంటి తలుపును గడ్డపారతో పగలగొట్టి వృద్ధురాలిపై ఉన్న రెండు తులాల బంగారు గొలుసులు దొంగలించారని సీఐ తెలిపారు.

వృద్ధురాలు లక్ష్మి ఫిర్యాదుతో ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో విచారణ చేయగా, ఘటన స్థలంలో అంబర్ ప్యాకెట్ పడి ఉందని, అలాగే ఇంటి చుట్టుపక్కల వారిని పిలిచి విచారించగా, వీరిపై అనుమానంతో తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారని సిఐ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. 

ఇటీవల దొంగతనాలకు పాల్పడ్డ దొంగలను పట్టుకుని సొమ్మును రికవరీ చేశాం..

మంథని, ముత్తారం, రామగిరి మండలాలలో ఇటీవల దొంగతనాలకు పాల్పడ్డ వారిని తమ సిబ్బందితో కలిసి దొంగలను పట్టుకొని వారి వద్ద నుంచి వారు దొంగలించిన సొమ్మును రికవరీ చేసినట్లు సిఐ రాజు తెలిపారు. మంథని మండలం పుట్టపాక లో ఒక టాక్టర్ ను దొంగలించగా, దొంగను అరెస్టు చేసి టాక్టర్ ను రికవరీ చేశామని, అలాగే మంథని పట్టణంలో ఇటీవల ఒక ఇంట్లో దొంగతనం చేయగా వారిని పట్టుకున్నామని, అలాగే బైకు ఎత్తుకెళ్లగా పట్టుకున్నమని, బొలెరో వాహనాన్ని మంథని నుంచి ఢిల్లీకి తరలించి అమ్ముకుంటే వారిని గుర్తించి పట్టుకున్నామని, ముత్తారం మండల కేంద్రంలో దాన్యం బస్తాలు దొంగలించిన వారిని పట్టుకున్నామని, మంథని మండలంలో ట్రాన్స్ఫార్మర్ల ను దొంగలించిన దొంగలను పట్టుకొని ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేశామన్నారు.

ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, రామగుండం సిపి, పెద్దపల్లి డిసిపి, గోదావరిఖని ఏసిపి ఆధ్వర్యంలో ఇకనుంచి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచుతామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాహనాలు, కొత్త వ్యక్తులపై అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గతంలో ఉన్నట్లు ఇకనుంచి గ్రామానికి ఒక వీపిఓను అలాగే ఐడి పార్టీ టీంను ఏర్పాటు చేసి పగడ్బందీగా రక్షణ చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దొంగలను  పట్టుకోవడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన మంథని ఎస్సైని, కానిస్టేబుల్ రమేష్ అశోక్, శివ, తదితరులను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్ఐ డేగ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, అశోక్,  బంగ్లా రాజ్ కుమార్, శివ తదితరులు ఉన్నారు.