calender_icon.png 28 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులకు మరో షాక్‌... డీజీపీ ఎదుట లొంగిపోయిన బండి ప్రకాష్

28-10-2025 10:46:44 AM

హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాశ్ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) సమక్షంలో ఎదుట లొంగిపోయారు. బండి ప్రకాష్(Maoist Bandi Prakash surrender) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో బండి ప్రకాశ్ 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్ గా పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ టీమ్ ఇన్ ఛార్జిగా ఆయన పనిచేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి చెందిన బండి ప్రకాష్1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎ‌స్‌యూ తరఫున పోరాటంలోకి దిగారు. ప్రకాష్ తండ్రి సింగరేణి కార్మికుడు. ఇప్పటికే దేశంలో అనేక మంది మావోయిస్టు కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. అనారోగ్య కారణాలతోనే బండి ప్రకాష్ లొంగిపోయారని సమాచారం.