28-10-2025 01:04:26 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి.. తన బావ తన్నీరు సత్యనారాయణ(Harish Rao father Satyanarayana) పార్థివ దేహానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. హరీశ్ రావును మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పరామర్శించారు. హరీశ్ రావు, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి హరీశ్ రావు ఓదార్చారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా కన్నుమూశారు. హరీష్ రావు తండ్రి మరణించిన నేపథ్యంలో ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యక్రమాలతో పాటు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.