28-10-2025 01:33:25 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో ఇండిగోకు చెందిన 25 ఏళ్ల ఎయిర్ హోస్టెస్(IndiGo air hostess) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అక్టోబర్ 24న రాజేంద్రనగర్‌లో జరిగినప్పటికీ వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జమ్మూకు చెందిన జాహ్నవిగుప్తాగా గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో జాహ్నవిగుప్తాతో పాటు ఇద్దరు సహోద్యోగులు, మరొక స్నేహితుడు ఉన్నారు. రాజేంద్రనగర్ నివాసం ఉంటున్న జాహ్నవి రాత్రి స్నేహితులకుతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇండిగోలో కెప్టెన్‌గా(Indigo Captain) పనిచేస్తున్న మహిళ స్నేహితురాలిలో ఒకరు ఫ్లాట్‌లో ఉన్నారని తెలిసింది. ఆ బృందం రాజేంద్రనగర్ లోని ఫ్లాట్‌లో పార్టీ చేసుకుంది. తరువాత తన గదికి వెళ్లిన ఆమె ఉరివేసుకుని కనిపించింది. ఈ సంఘటన తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, జాహ్నవి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లి సోనికా గుప్తా ప్రకారం, జమ్మూకు చెందిన ఆ మహిళ గత కొన్ని సంవత్సరాలుగా ఇండిగోలో ఉద్యోగిగా పనిచేస్తోందని, ఫ్లాట్‌మేట్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తోందని చెప్పారు. జాహ్నవి గత కొన్ని నెలలుగా నిరాశతో ఉన్నట్లు తల్లి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు " రూంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ఆమె మొబైల్ ఫోన్‌ను పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నాము. కుటుంబం ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. దర్యాప్తు జరుగుతోంది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.