29 మంది మావోయిస్టుల లొంగుబాటు
లొంగిపోయిన వారిలో పార్టీ అగ్రనేత బుధ్రా
వివరాలు వెల్లడించిన సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం ౨౯ మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులకు కంచుకోటగా భావించే దర్భా డివిజన్ పరిధిలోని కేరళపాల్ ఏరియా కమిటీకి చెందిన ౨౯ మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునా రావాస పథకాలకు ఆకర్షితులై, మావోయిస్టు పార్టీ విధి విధానాలు నచ్చక వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గొ గుండా ప్రాంతానికి చెందిన మావోయి స్టు పార్టీ డీఏకేఎంఎస్ చీఫ్ పోడియం బుధ్రా కూడా ఉన్నాడు. బుధ్రాపై రూ. 2 లక్షల రివార్డు ఉంది. గడిచిన ఎనిమి ది రోజుల్లోనే సుక్మా, దంతెవాడ జిల్లా ల్లో కలిపి వంద మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.




