calender_icon.png 8 December, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.610 కోట్లు వాపస్

08-12-2025 01:35:35 AM

-ప్రయాణికుల ఖాతాల్లోకి రీఫండ్ సొమ్ము

-యుద్ధప్రాతిపదికన చెల్లింపులు 

-సర్వీసుల రద్దుపై ఇండిగో సీఈవో వివరణకు  మరో 24 గంటల సమయం : డీజీసీఏ

-ఈనెల 10 నాటికి పూర్తిస్థాయిలో సర్వీసులు : సీఈవో

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: వారం రోజుల నుంచి ఇండిగో విమాన సర్వీసుల రద్దు, అంతరాయం సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో కేంద్ర కన్నెర్ర చేసి ప్రయాణికుల ఖాతాల్లోకి టిక్కెట్ల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశించింది. అందుకు ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు గడువు విధించింది.

దీంతో సంస్థ ప్రయాణికుల ఖాతాల్లో రూ.610 కోట్ల టిక్కెట్ల సొమ్మును రీఫండ్ చేసింది. సంస్థ పూర్తిస్థాయిలో ప్రయాణికులకు రీఫం డ్  చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. మరోవైపు విమాన సర్వీసుల సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సంస్థ సమగ్రమైన చర్యలు చేపడుతున్నది.

సంక్షో భం వల్ల రోజువారీ ఇండిగో సర్వీసుల సం ఖ్య 2,300 కాగా.. శని,ఆదివారాల్లో ఆ సం ఖ్య 1,500  1,650కు పడిపోయింది. రెం డు రోజుల్లో సంస్థ 138 గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్‌లైన్ ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ కూడా 75%కి పెరిగిందని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. డిసెంబర్ 10 నాటికి పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఉద్ఘాటించారు.

సంస్థ విమాన సర్వీసుల అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు నిరంతరం పర్యవేక్షణ కొనసా గిస్తున్నారు. మరోవైపు సంక్షోభంపై ఇవ్వాలని సంస్థ సీఈవోకు ఇచ్చిన 24 గంటల గడువు విధించిన సంగతి తెలిసింది. తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరో 24 గంటల సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.