ఆడుతూ పాడుతూ..
ముంబైపై లక్నో విజయం
మెరిసిన మోసిన్, స్టొయినిస్
బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్లో లక్నో సిక్సర్ కొట్టింది. చప్పగా సాగిన పోరులో ముంబైని మట్టికరిపించిన రాహుల్ సేన.. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. లక్నో బౌలర్ల ప్రతిభకన్నా ముంబై బ్యాటర్ల స్వయంకృతాల వల్లే పాండ్యా సేన ఏడో ఓటమి మూటగట్టుకుంది.
లక్నో: ప్లే ఆఫ్స్ దిశగా లక్నో సూపర్ జెయింట్స్ మరో ముందడుగు వేసింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లక్నో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన లక్నో ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నెహల్ వధేరా (46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (32) పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (10), తిలక్ వర్మ (7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (0) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మోసిన్ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో అదరగొట్టగా.. కెప్టెన్ రాహుల్ (28; 3 ఫోర్లు, ఒక సిక్సర్) మోస్తరుగా ఆడాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా బుధవారం చెన్నైతో పంజాబ్ తలపడనుంది.
పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ఓ ర.రే పా
రాజస్థాన్ 9 8 1 0.69 16
కోల్‌కతా 9 6 3 1.09 12
లక్నో 10 6 4 0.09 12
చెన్నై 9 5 4 0.81 10
హైదరాబాద్ 9 5 4 0.07 10
ఢిల్లీ 11 5 6 10
గుజరాత్ 10 4 6 8
పంజాబ్ 9 3 6 6
ముంబై 10 3 7 6
బెంగళూరు 10 3 7 6
నోట్: మ్యా గెఊగెలిచినవి,
ఓ ర.రే పావూ






