14 July, 2026 | 8:49 AM

చెన్నై x పంజాబ్

01-05-2024 01:11 AM

ఐపీఎల్  17వ సీజన్‌లో భాగంగా నేడు మరో కీలక పోరు జరగనుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. 

చెన్నై: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న తరుణంలో ఐపీఎల్ 17వ సీజన్‌లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై హైదరాబాద్‌ను చిత్తు చేసిన చెన్నై.. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని చూస్తుంటే.. గత మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించిన పంజాబ్ జోరు కొనసాగించాలని భావిస్తోంది. తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన చెన్నై ఐదు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంటే.. అన్నే మ్యాచ్‌లాడిన పంజాబ్ మూడు విజయాలతో టేబుల్‌లో 8వ స్థానంలో కొన సాగుతోంది. చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే.. కెప్టెన్ రుతురాజ్ , డారిల్ మిషెల్, దూబేలతో పటిష్టంగా కనిపిస్తుండగా.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మెరుపులు మెరిపిస్తున్నాడు. పంజాబ్ విషయా నికి వస్తే కోల్‌కతాతో మ్యాచ్‌లో అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన బెయిర్ స్టో కీలకం కానుండగా.. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అశుతోష్ శర్మలు రాణిస్తే చెన్నైకి కష్టాలు తప్పవు. కగిసో రబడ, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్‌లతో బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది.