గంజాయి విక్రేత అరెస్టు
ద్విచక్రవాహనం, 36లక్షల ఓజీకుసు హైబ్రీడ్ గంజాయి సీజ్
ముషీరాబాద్,ఏప్రిల్ 21(విజయక్రాంతి): గుట్టుచప్పుడు కాకుండా హైబ్రీడ్ గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుంచి భారీ మొత్తంలో ఓజీకుసు హైబ్రీడ్ గంజాయి స్వాధీనం చేసుకొని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
ముషీరాబాద్ ఎక్సైజ్ ఎన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నామాల గుండు ప్రాంతానికి చెందిన రోషన్ సింగ్ (29) అనే ప్రైవేటు ఉద్యోగి ఓజీకుసు హైబ్రీడ్ గంజాయిని బ్యాగ్ వేసుకొని తన ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు.
అప్రమత్తమై నామాలగుండు వద్ద మాటువేసి అతన్ని పట్టుకున్నామని తెలిపారు. రోషన్ సింగ్ వద్ద ఉన్న బ్యాగులో 1.311 కిలోల ఓజీ కుసు హైబ్రీడ్ గంజాయి లభించింది. దీని విలువ మార్కెట్ సుమారు రూ. 36లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి గంజాయి, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామని తెలి పారు.
యాప్రాల్ కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకువస్తున్నానని రోషన్ సింగ్ తెలిపారు. గతంలో ఇతనిపై ఖార్కాన పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తర లించామని తెలిపారు. ఇతర సమాచారం కోసం విచారణ చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.






