రేపు వీహెచ్ జన్మదిన వేడుకలు
15-06-2026 01:49 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు జన్మదిన వేడుక లను ఈ నెల 16వ తేదీన ఆయన నివాసం లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శ రాజబోయిన లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ తెలిపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీల హక్కుల సాధనకు అనేక పోరాటాలను చేశారని వివరించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే వి. హనుమంతరావు జన్మదిన వే డుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.






