calender_icon.png 20 January, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మార్కొండ యోగిత

20-01-2026 01:05:14 AM

నిర్మల్, జనవరి ౧9 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటించక ముందే నిర్మల్‌లో భారత రాష్ట్ర సమితి నిర్మల్ చైర్మన్ అభ్యర్థిగా మార్గొండ యోగిత రాము పేరును అధికారికంగా ప్రకటించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రకటించారు. 2004 నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా నిర్మల్ పట్టణ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మల్ పట్టణంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కార్యచరణలను అమలుచేసి పార్టీకి సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ అధ్యక్షునిగా పనిచేస్తున్న మార్గుండ రాము సతీమణి యోగిత మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు . మున్సిపల్ చైర్మన్లు జనరల్ మహిళ కేటాయించడంతో అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.