20-01-2026 01:03:42 AM
మంత్రులు వివేక్, కృష్ణారావు
చెన్నూర్, జనవరి 19 : ప్రజలతో మమేక మై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తు న్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మా గార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివే క్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూ ర్ మండల కేంద్రంలో చేపట్టిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర పర్యా టక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌లతో కలిసి భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చెన్నూర్ పట్టణంలో 47 కోట్ల 11 లక్షల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేసి నిర్మా ణానికి భూమి పూజ చేశామని, వృత్తి విద్యా కోర్సులలో నైపుణ్య శిక్షణను అందించి యువతకు ఉపాధి కల్పించడం కొరకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాం తంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ మన ఇసుక వాహనం ద్వారా తక్కువ ధరకు విని యోగదారులకు ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి కృష్ణారావు మాట్లా డుతూ ఎంతో మంది తెలంగాణ ప్రజల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలి పారు. అనంతరం చెన్నూర్ పరిధిలోని 214 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 76 లక్షల 65 వేల 430 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరు లు పాల్గొన్నారు.