09-07-2025 05:40:31 PM
హైదరాబాద్: గతకొన్ని రోజులుగా భర్తలను భార్యలు మట్టుబెడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటననే మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టేపల్లిలోని సైఫీ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ తన భర్యతో కలిసి కూలి పనులు చేసుకొంటు జీవనం సాగిస్తున్నాడు. కూలి పనులు చేసుకునే షేక్ మహమ్మద్ మద్యానికి బానిసాయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి భార్యను వేదిస్తుండేవాడని, అది భరించలేని భార్య, భర్త నిద్రిస్తున్న సమయంలో అదునుచూసి బండరాయితో తలపై మోది హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నింధితురాలని అదుపులోకి తీసుకొని విచారించారు.