10 June, 2026 | 1:16 AM

యాప్రాల్‌లో వివాహిత అదృశ్యం

10-06-2026 12:41 AM

జవహర్‌నగర్, జూన్ 9 (విజయక్రాంతి): ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ వివాహిత యాప్రాల్లో అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఎస్హెచ్‌ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... వెస్ట్ బెంగాల్ కు చెందిన దంపతులు  చెట్టారి, భార్య ఆయేషా రాయితో కలిసి యాప్రాల్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.

ఈనెల 1న భర్త చెట్టారి పనులకు వెళ్లి ఇంటికి రాగా భార్య ఆయేషా రాయి( 25) కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికిన బంధువుల వద్ద వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు భర్త చేట్టారి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.