10 June, 2026 | 1:24 AM

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా అనంతరాములు

10-06-2026 12:41 AM

మేళ్లచెరువ,  జూన్ 9 : హుజూర్నగర్ పట్టణానికి చెందిన మాశెట్టి అనంత రాములు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాదులో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నుండి నియామక పత్రం అందుకున్నారు. అనంతరాములు నియామకం పట్ల మేళ్లచెరువు ఆర్యవైశ్య సంఘం హర్షం ప్రకటించింది. మేళ్లచెరువు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వరగాని నాగరాజు, ప్రధాన కార్యదర్శి కొప్పురావూరి శంకర్,, కోశాధికారి విడాల పురుషోత్తం,  ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం ప్రకటించారు.