10 June, 2026 | 1:33 AM

చేప ప్రసాదం పంపిణీని పరిశీలించిన ‘మెట్టు’

10-06-2026 12:42 AM

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్

వసతులపై ఆరా తీసిన సాయికుమార్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): మృగశిర కార్తిని పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం కోసం వచ్చిన ఉబ్బసం రోగులు, వారి సహాయకులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రెండు రోజులపాటు అల్పాహారం, మంచినీరు, భోజనం వసతి కల్పి స్తున్నామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.

మంగళవారం రోగులు వారి సహాయకులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు వృద్ధులు, దివ్యాంగులు, బ్యాటరీ వాహనాలు వీల్ చైర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ కౌంటర్లను పరిశీలించారు. అలాగే చేప పిల్లలను అందుబాటులో ఉంచామని తెలిపారు ఈ మందు పంపిణీ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగిందన్నారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో ఎగ్జిబిషన్ మైదానం కిటకిట లాడిందని ఆయన తెలిపారు.