21-05-2025 07:44:53 PM
కర్ణాటక,(విజయక్రాంతి): కర్ణాటక రాష్ట్రం(Karnataka) విజయపుర(Vijayapura)లోని బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. సోలాపూర్ వైపు వెళ్తున్న మహీంద్ర ఎస్యూవీ కారు బసవనబాగేవాడి తాలూకాలోని మనగులు సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మనగులి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు జోగులాంబ గద్వాల జిల్లా, మల్దికల్ మండలం, మల్లెందొడ్డి వాసులు టీ.భాస్కర్, భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులను తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన చేపట్టారు.